'మా ముత్తాత ఊరది. ఆయన పేరుతో ఆ ఊరు వెలసింది. అదే నా మూలం, అదే నా ఊరు, అదే నా చిరునామా' అంటున్న లగడపాటి రాజగోపాల్ తన ముత్తాత పేరుతో తనకున్న అనుబంధం మరువలేనిదంటారు. మా ముత్తాత పేరుతో చేసే ప్రతీ పని ఫలిస్తుందని అంటున్న ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. నేనెన్ని ఊళ్లు తిరిగినా నా ఊరు మాత్రం 'అమరపనాయుడు కండ్రిక' అంటున్న ఈ ఎంపీగారి కబుర్లే ఈ 'మా ఊరు'.
"ఊరగానే పచ్చనిపైర్లు, మట్టి రోడ్లు, పెంకుటిళ్లు, వాగులు, వంకలు గుర్తుకొస్తాయి. నేను పుట్టింది నెల్లూరు పట్టణంలోనైనా ఊరి జ్ఞాపకాలనగానే మా అమ్మమ్మ ఊళ్లో నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలు ఇప్పటికీ నా కళ్లముందు మెదులుతుంటాయి. నా చిన్నప్పుడు వేసవి సెలవులు రాగానే మా తాతయ్యల రాకకోసం వేయికళ్లతో ఎదురుచూసేవాడ్ని. ముందు మా అమ్మమ్మ ఊరికి వెళ్లేవాడ్ని. అక్కడి నుంచి నాన్నఊరికి. అమ్మమ్మ ఊళ్లో అడుగుపెట్టడంతో మొదలయ్యేది నా హడావిడి. అక్కడ నాకొక బ్యాచ్ ఉండేది. ఓ పదిమంది కుర్రాళ్లు కలిసి ఊరి చివరన ఉన్న తాటి చెట్ల దగ్గరికి పరిగెట్టేవాళ్లం. అప్పటికే మా తాతయ్య మాకోసం నాలుగు తాటి గెలలు కొట్టించేవాడు.
నువ్వెన్ని అంటే నువ్వెన్ని అంటూ పోటీ పడి తినేవాళ్లం. ముంజల కాలం అయిపోయాక తేగల కాలం వచ్చేది. పచ్చి కర్రలు చేతిలో పట్టుకుని తేగల కోసం మట్టి తవ్వడంలో బిజీ అయిపోయేవాళ్లం. పొద్దున్నే తవ్వుకుని వాటిని కాల్చి తినేవాళ్లం. సెలవులన్నీ ఇట్టే గడచిపోయేవి. మరో పదిరోజులు సెలవులున్నాయనగా మా నాన్నూరు నుంచి కబురు వచ్చేది. మా మూత్తాత పేరు అమరపనాయుడు. మా ఊరి పేరు కూడా అదే. 'అమరపనాయుడు కండ్రిగ'. నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. మా తాత (వెంకట సుబ్బానాయుడు), నాన్న (వెంకట రామానాయుడు) అందరూ అదే గ్రామంలో పుట్టి పెరిగారు. నేను మాత్రం నెల్లూరు పట్టణంలో పుట్టాను. చదువులు టౌన్‌లో, సెలవులు ఊళ్లో. నాలుగు తరాలవారు పుట్టి పెరిగిన అమరపనాయుడు కండ్రిగే నా ఊరు, ఉనికి.
అమరపనాయుడి ప్రాంతం...
మా ఊరికి మా ముత్తాత పేరు ఎలా వచ్చిందంటే...ఆ ప్రాంతానికి ఆయనే మొదట వచ్చారని చెప్పేవారు మా పెద్దలు. చాలా పెద్ద రైతాయన. కండ్రిక అంటే పలానా వారి ప్రాంతం అని అర్థం. మా ముత్తాతే ముందు వెళ్లిన ప్రాంతం కావడంతో ఆయన పేరుతో 'అమరపనాయుడు కండ్రిక' అని పిలవడం మొదలెట్టారని మా తాతయ్య చెప్పారు. నాన్న, పెదనాన్న, మేనత్త అందరూ మా ముత్తాత కట్టిన ఇంట్లో కలిసే ఉండేవారు. మా తాతది పెద్ద కుటుంబమే అయినా ఊరు మాత్రం చాలా చిన్నది. అందరూ రైతులే. మా తాతగారు కూడా వ్యవసాయమే చేసేవారు. నేను పుట్టింది నెల్లూరి టౌన్‌లోనైనా ఎక్కువగా మా తాతయ్య దగ్గరికి వెళ్లేవాడ్ని. నా చిన్నప్పుడు ఆ ఊళ్లో వందిళ్లకు మించి ఉండేవి కావు.
లారీ డ్రైవర్ నాన్న...
నాన్న మాత్రం వ్యవసాయం జోలికి వెళ్లలేదు. మొదట్లో ఒక లారీ కొనుక్కుని ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేశారు. కొన్నాళ్ల తర్వాత ఒక ప్రయివేటు బస్సు తీసుకున్నారు. మా చదువులు, నాన్నగారి వ్యాపారం కలసి మమ్మల్ని నెల్లూరు పట్టణం దాటనివ్వలేదు. అయినా సరే సెలవులు వస్తే చాలు నాన్నతో అమరపనాయుడు కండ్రిక, అమ్మతో పెరుమాళ్లపాడు వెళ్లిపోయేవాడ్ని.
తాత చెప్పిన కథలు...
కథలు వినాలంటే అమరపనాయుడు కండ్రికకు వెళ్లాలి. తాటి ముంజలు కావాలంటే పెరుమాళ్లపాడుకి అంటే మా అమ్మమ్మ ఊరికి వెళ్లాలి. మా తాతయ్య వెంకట సుబ్బానాయుడు నన్ను తన పక్కనే పడుకోబెట్టుకుని బోలెడు కథలు చెప్పేవాడు. ఊరికి సంబంధించి, మా పూర్వీకులకు సంబంధించి యధార్థ సంఘటల్ని కథలుగా మలచి ఎంతో ఆసక్తిగా చెప్పేవారు. ఆయన చెప్పిన ఒక సంఘటన నేను ఎప్పటికీ మరచిపోలేను. ఒకరోజు మా చిన్నతాతయ్య పొలం గట్టు నుంచి వస్తుంటే పాము కరిచి చనిపోయాడట. ఆయన పేరే మానాన్నకు పెట్టారు. మా నాన్న పెద్దయ్యాక ఒకరోజు నాన్న కాలికి పాము చుట్టుకుందట. వెంటనే నాన్న దాన్ని చేత్తో పట్టుకుని దూరంగా విసిరేశాడట. మా నాన్న ధైర్యసాహసాల గురించి రకరకాల సంఘటల్ని వివరిస్తూ బోలెడు కథలు చెప్పేవాడు తాతయ్య. ఆయన చెప్పిన కబుర్లని ఊళ్లోని నా స్నేహితులతో గొప్పగా చెప్పేవాడ్ని నేను.
అమ్మఊరు...
మా అమ్మ తండ్రి వేమన మాలకొండయ్యకి నేనంటే ప్రాణం. సెలవులు వచ్చాయంటే చాలు నెల్లూరుకి వచ్చి నన్ను తీసుకెళ్లేవాడు. పెరుమాళ్లపాడులో తాతయ్యకు మంచి పేరుండేది. ఎందుకంటే అక్కడ తాతయ్యే ఆల్ ఇన్ వన్. జబ్బు చేసినవారికి ఇంజక్షన్ చెయ్యడం నుంచి రేడియో రిపేర్లవరకూ అన్ని పనులు తాతయ్యే చేసేవాడు. (నవ్వుతూ...) ఏ పనికీ లైసెన్సు ఉండేది కాదు. పోస్టుమెన్ ఉద్యోగం కూడా ఆయనదే. ఆ ఊళ్లో ఎక్కువగా తాటి చెట్లు ఉండేవి. తాటి ముంజలు, తేగలు బాగా దొరికేవి. తాటి ముంజలు పట్టుకుని మామిడి తోటల్లోకి వెళ్లి అక్కడ కూర్చుని తాపీగా తినేవాళ్లం. తేగలకోసం మట్టిని తవ్వడం, కాల్చుకుని తినడం, స్నేహితులకి పంచడం....చాలా హడావిడిగా ఉండేది. ఇప్పటికీ తాటి ముంజల పేరు వినపడగానే పెరుమాళ్లపాడు గుర్తుకొస్తుంది. అమ్మకు ఆ ఊరితో అనుబంధం ఎక్కువ. ఊళ్లోని ప్రతి గడపతోను పరిచయం ఉందామెకు.
లాంకో నామకరణం...
నేను రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారంలో అడుగుపెట్టాను. నా వ్యాపారాలన్నీ లాంకో (లగడపాటి అమరపనాయుడు కంపెనీ) పేరుతోనే ఉంటాయి. అంటే మా ముత్తాత పేరుమీద. మా పెదనాన్న పేరు కూడా అదే. వ్యాపారాలు,సేవా కార్యక్రమాలు అన్నీ మా ముత్తాత పేరు మీదే. అమరపనాయుడు కండ్రికలో మా ముత్తాత కట్టిన ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో మా మేనత్త ఉంటున్నారు. ఊళ్లో పెద్దగా ఆస్తులు లేకపోయినా మా ముత్తాత పేరుతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము గుంటూరు వచ్చేశాక మా తాతల ఊర్లతో సంబంధాలు బాగా తగ్గిపోయాయి. మూడేళ్ల క్రితం లాంకో పేరుతో అమరపనాయుడు కండ్రికలో బస్‌షెల్టర్ కట్టించాను. అలాగే మంచినీటి సౌకర్యం లేక ఊరి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశాను. ఆ సమయంలో ఊరి ప్రజల కళ్లలో ఆనందం నేను ఎప్పటికీ మరువలేను. ఆ ఊళ్లో ఇప్పటికీ మా ముత్తాత గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. ఆయన రోజుల్లో తన స్థోమతకు తగ్గట్టుగా తాతయ్య ఊరి ప్రజలకు చేసిన సాయాన్ని తలుచుకుంటూ ఉంటారు. ఆయన బాటలోనే నేనూ నడుచుకుంటున్నాను.
12 కోట్లతో...
లాంకో ఫౌండేషన్ తరపున అమరపనాయుడు కండ్రికలో 12 కోట్ల వ్యయంతో వృద్ధాశ్రమం కట్టిస్తున్నాను. దీని గురించి ముందు మా ఊరి ప్రజలతో మాట్లాడాను. మా ఊరి ప్రజలే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ల వారు కూడా వృద్ధాశ్రమం కావాలన్నారు. చదువుల పేరుతో, ఉద్యోగాల పేరుతో ఊళ్లొదిలే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. పిల్లలు ఎక్కడికి వెళ్లినా ఒంటరిగా లేదంటే జంటగా వెళుతున్నారు. కాని వృద్ధుల్ని వెంటబెట్టుకుని తీసుకెళ్లడం లేదు. దాంతో సొంతూర్లో ఉంటూనే పెద్దలు అనాథలవుతున్నారు. అవసానదశలో నా అన్నవాళ్ల తోడులేక ఇబ్బందిపడుతున్నారు. మా చుట్టుపక్కల గ్రామాల్లో అలాంటివారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుసుకుని పూర్తి వసతులతో కూడిన వృద్ధాశ్రమం కట్టడానికి నిశ్చయించుకున్నాం. అది కూడా మా ముత్తాత పేరుతో కడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ పని చేసినా మన పెద్దల్ని గుర్తుచేసేలా ఉండడం సంతోషాన్నిస్తుంది. ప్రస్తుతం ఊళ్లో వృద్ధాశ్రమం పనులు మొదలయ్యాయి. మా ఊరిప్రజలకు అవసరమ్యే సౌకర్యాలు ఏర్పాటు చెయ్యడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.
ఆ ఊళ్లో ఎక్కువగా తాటి చెట్లు ఉండేవి. తాటి ముంజలు, తేగలు బాగా దొరికేవి. తాటి ముంజలు పట్టుకుని మామిడి తోటల్లోకి వెళ్లి అక్కడ కూర్చుని తాపీగా తినేవాళ్లం. తేగలకోసం మట్టిని తవ్వడం, కాల్చుకుని తినడం, స్నేహితులకి పంచడం....చాలా హడావిడిగా ఉండేది. ఇప్పటికీ తాటి ముంజల పేరు వినపడగానే పెరుమాళ్లపాడు గుర్తుకొస్తుంది.
అమ్మ కోసం...
అమ్మకు తన ఊరి(పెరుమాళ్లపాడు)తో అనుబంధం ఎక్కువ. ఊరికి కావాల్సిన ఎలాంటి సాయాన్ని చేయడానికైనా ముందుకెళుతుంది. ఈ మధ్యనే తన ఊళ్లో రామాలయం కట్టించింది. మా తాతయ్య మాలకొండయ్యకు ఊళ్లో మంచి పేరుందని చెప్పాను కదా! ఆయన తర్వాత ఊరివాళ్లంతా అమ్మనే తలిచేవారు. అమ్మ కూడా అందరితో కలిసిపోయేది. తను ఏ స్థాయిలో ఉన్నా ఊరికి వెళ్లిందంటే నా చిన్నప్పటి అమ్మలా మారిపోతుంది. నాన్న కూడా అంతే తనకి ఊరు గుర్తొచ్చినప్పుడల్లా అమరపనాయుడు కండ్రికకు వెళ్లివస్తుంటారు. వెళ్లొచ్చాక ఊరి కబుర్లను ఎంతో ఆసక్తిగా చెబుతారు. నేను పెద్దగా పూజలు చేయను. కాని మా అమ్మ ధైవభక్తురాలు. ఆమెకు మానవసేవ, మాధవసేవ రెండూ కావాలి. నేను అప్పుడప్పుడు పెరుమాళ్లపాడుకి వెళ్లివస్తుంటాను.

No comments:
Post a Comment